NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైకాపా మంత్రి గా ధృతరాష్ట్ర పాత్ర పోషించా

1 min read

కల్తీ నెయ్యి లడ్డూ పాపంలో వైసిపి వారందరూ భాగస్వాములే

గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

 మంత్రాలయం న్యూస్ నేడు :  గత వైకాపా ప్రభుత్వం లో మంత్రి గా ఉండి ధృతరాష్ట్ర పాత్ర పోషించానని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. సోమవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో వచ్చారు. వీరికి శ్రీమఠం అధికారులు స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఫలమంత్రాక్శితలు ఇచ్చి ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుపతి కల్తీ నెయ్యి లడ్డూ ప్రసాదం పాపంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు వైకాపా లోని వారందరూ భాగస్వాములే అన్నారు.  2019 – 24 వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా కళ్లుకు గంతులు కట్టుకుని దృతరాష్ట్రుని పాత్ర పోషించానని తెలిపారు. వైకాపా పాలనలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కల్తీ లడ్డూ ప్రసాదంగా అందించారని విమర్శించారు. తిరుమల లడ్డూ రుచి లేదని భక్తులు ఆ రోజుల్లోనే ఫిర్యాదు చేశారని చెప్పారు. సిట్ అధికారులు కూడా లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు. నేడు కూటమి ప్రభుత్వంలో దేవాలయాల నిర్వహణ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని, అలాంటి వాటికి అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఆయనకు సిఐ రామాంజులు హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు కానిస్టేబుల్ రామకృష్ణ తగిన భద్రత కల్పించారు.

About Author