జీజీహెచ్ ఆకస్మిక తనిఖీ…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో గల దిశ ఒన్ స్టాప్ కేంద్రం, మరియు మహిళాప్రాంగనాన్ని (శక్తి సదన్) పరిశీలించిన న్యాయమూర్తిజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి ఈ రోజు అనగా 15-09-2025 సోమవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు గల దిశ ఒన్ స్టాప్ కేంద్రం మరియు, మహిళాప్రాంగనాన్ని (శక్తి సదన్) ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించి వాటిని సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచనలు చేశారు అనంతరం అక్కడ వున్న వారికి ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తే 15100 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేస్తే వెంటనే న్యాయ సహాయం అందిస్తామని తెలియజేశారు. ప్రాంగణంలో సౌకర్యాలు, పరిశుభ్రతను పరిశీలించారు. అక్కడ ఉన్నవారు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ఈ సదస్సులో పాల్గొన్న వారికి లీగల్ సర్వీసెస్ ఆక్ట్ 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అందరూ అర్హులని తెలిపారు. వన్ స్టాప్ సెంటర్ నందు ప్రభుత్వం ద్వారా అందజేసే బాధితుల పరిహారానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ మరియు మహిళా ప్రాంగణం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

