NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి

1 min read

సెప్టెంబర్ నెలను పోషణ మాసంగా నిర్వహిస్తూ ప్రజల్లో పౌష్టికాహారంపై విస్తృతంగా అవగాహన కల్పించండి.

జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య

కర్నూలు, న్యూస్ నేడు: గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో పౌష్టికాహార మాసోత్సవాల పోస్టర్స్ ను  జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ  ప్రతి సంవత్సరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్  నెలలో   పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు  పోషణ్ మా వేడుకలు జిల్లాలోని 1886 అంగన్వాడీ కేంద్రాల్లో  ఘనంగా జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్ లోని  దార్ లో ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.జిల్లాలోని 9 ఐసిడిఎస్ ప్రాజెక్టులలో రకరకాల కార్యక్రమాల ద్వారా  అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తో ఈ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమాల్లో  లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో  పాల్గొనాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డి ఆర్ ఓ సి.వెంకట నారాయణమ్మ, ఐసిడిఎస్ పిడి విజయ తదితరులు పాల్గొన్నారు.

About Author