రిడ్జ్ స్కూల్‌లో గ్లోబల్ ఫుడ్ పరేడ్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రిడ్జ్ స్కూల్‌లో 1, 2వ తరగతి విద్యార్థుల కోసం “గ్లోబల్ బైట్స్ – టేస్టీ డిలైట్స్” పేరుతో వరల్డ్ ఫుడ్ పరేడ్ నిర్వహించారు. విద్యార్థులు భారతదేశం, ఇటలీ, మెక్సికో దేశాల వంటకాలతో ఆకట్టుకున్నారు. 1వ తరగతి చిన్నారులు వేషధారణలతో సందడి చేయగా, 2వ తరగతి విద్యార్థులు వంటకాల వివరాలు తెలియజేశారు. ఆహారాన్ని వృథా చేయకూడదనే సందేశం ఇచ్చారు. కో-సీఈఓ శ్రీమతి సౌమ్య , ప్రిన్సిపాల్ శ్రీమతి రాజ్‌కమల్ మాథ్యూస్ పాల్గొని అభినందించారు. న్యాయనిర్ణేతలుగా శ్రీమతి భార్గవి , లోకేశ్వర్ రెడ్డి వ్యవహరించారు. కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సంభాషణ నైపుణ్యాలు, ప్రపంచ అవగాహన పెంపొందాయి.

