పైప్ లైన్ డామేజ్, మెయిన్ పైప్ లైన్ రిపేరు పనులు ఎస్ఎంఆర్ పరిశీలన
1 min read

అత్యవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా
కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్ లో రిజర్వాయర్లకు నీటిని పంపే మెయిన్ పైప్లైన్ జాయింట్ డ్యామేజ్ అయిన కారణంగా ఏలూరు టూ టౌన్ ప్రాంత ప్రజలకు సోమవారం సాయంత్రం అరగంటసేపు,మంగళవారం ఉదయం కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా జరగదని కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు తెలిపారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ ఎం.ఈ సురేంద్రబాబు,ఎలక్ట్రికల్ డి.ఈ నారాయణరావు,ఏ.ఈ సాయిలతో కలిసి హెడ్ వాటర్ వర్క్స్ ప్రాంతంలో డ్యామేజ్ అయిన మెయిన్ పైప్ లైన్ రిపేర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ గతంలో కూడా ఇదే ప్రాంతంలో మెయిన్ పైప్లైన్ డ్యామేజ్ అయింది అన్నారు. ఇప్పుడు మరలా డ్యామేజ్ అవ్వడంతో రాజమండ్రి నుండి ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ తీసుకురావడం జరిగిందన్నారు.వారు పనులు ప్రారంభించారని ఈరోజు తెల్లవార్లు ఆ పని కంప్లీట్ చేసి మంగళవారం ఉదయం నుండి రిజర్వాయర్లకు నీరునింపి సాయంత్రం యధావిధిగా కుళాయిల ద్వారా త్రాగునీటి సరఫరా జరుగుతుందని ఎస్ ఎం ఆర్ పెదబాబు తెలిపారు. టూ టౌన్ ప్రాంతంలో 8 రిజర్వాయర్ల పరిధి అంటే చాణిక్య పూరి కాలనీ,తాపీ మేస్త్రి కాలనీ,రాజీవ్ గాంధీ పార్క్, అమీనాపేట, శాంతినగర్, కబాడీ గూడెం ఏరియా, ఏఎస్ఆర్ స్టేడియం రిజర్వాయర్ల పరిధిలో అంతరాయం కలుగుతుందని పెదబాబు తెలిపారు.అత్యవసరమైనచో ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేయడం జరుగుతుందని కావలసినవారు ఏ.ఈ రఫీ 8978999933.ట్యాప్ ఇన్స్పెక్టర్.నారాయణ 9309148944 ఈ నెంబర్ల వారిని సంప్రదించాలని పెదబాబు తెలిపారు.


