NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజాసేవలో వినయం కీలకం…

1 min read

నగరపాలక సంస్థ మేనేజర్ యన్.చిన్నరాముడు

కర్నూలు, న్యూస్​ నేడు: గురువారం నగరపాలక సంస్థకు వచ్చే ప్రజలతో వినయంగా వ్యవహరించడం, ప్రతి దరఖాస్తును సహనంతో పరిశీలించడం అత్యంత కీలకమని నగరపాలక సంస్థ మేనేజర్ యన్.చిన్నరాముడు అన్నారు. గురువారం నగరపాలక కార్యాలయంలోని జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ విభాగాన్ని ఆయన అకస్మికంగా తనిఖీ చేసి, పలు దస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడంతో పాటు విధి వేళల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. నగరపాలక సంస్థకు మంచి పేరు తీసుకొచ్చేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.

About Author