కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి, మేయర్ అభ్యర్థి విస్తృత ప్రచారం
1 min read
ఏలూరును గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతామతాం
హామీ ఇచిన కాంగ్రెస్ పార్టీ మేయర్,కార్పొరేటర్ అభ్యర్థులు
ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్: ఏలూరు నగరంలోని 34వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బురదగుంట హేమంత్ కుమార్, ఏలూరు కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బురదగుంట లివిన్ క్రిస్టియన్ కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థి బురదగుంట లివిన్ క్రిస్టియన్ మాట్లాడుతూ, యువ నాయకత్వానికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేసి చూపిస్తామని తెలిపారు. ఏలూరును నిజమైన గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, నగర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామమోహనరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నున్నె పవన్ తేజ నాయుడు, తమిళనాడు నుంచి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ లెనిన్ ప్రసాత్ పాల్గొన్నారు. వీరితో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.


