NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లబ్ధిదారులకు పింఛన్‌ పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోట్ల

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  డోన్ పట్టణంలోని 1వ వార్డు కెవిఎస్ కాలనీ నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో  డోన్ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పింఛన్ లబ్ధిదారులకు పింఛన్‌ పంపిణీ చేసి, ప్రజలతో మమేకమయ్యారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం వల్ల వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలు ఆర్థికంగా కొంత ఊరట పొందుతున్నారని తెలిపారు. ప్రతి పింఛన్ మీ భరోసా, ప్రతి రూపాయి మీ అండ, అని ఎమ్మెల్యే  ఉద్ఘాటించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరవేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, ప్రజల సమస్యలు తీర్చడంలో ఎప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

About Author