గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గితే మనిషి మనుగడకే ప్రమాదం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: స్వచ్చ ఆంధ్ర –స్వర్ణంద్ర ను పురస్కరించుకుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి కార్యాలయములో పరిసరాలను శుభ్రపరచినారు.అనంతరం జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్.భాస్కర్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో ఆరోగ్యంగా జీవించాలంటే వాయు కాలుష్యం లేకుండా ఉండడము చాలా ముఖ్యము, ఎoదుకంటే మనం జీవించాలంటే ఆక్సిజన్ అవసరం ,అధిక కాలుష్యం వలన గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గితే మనిషి మనుగడకే ప్రమాదం, మనం జరుపుకొనే ఈ దీపావళి పండగ సందర్భంగా కాల్చే బాణసంచా లో కూడా అధిక శాతం విష వాయువులేనని రసాయనాలు,వివిధ మూలకాలు మనుషులు,ఇతర జీవులపై విష ప్రభావం చూపుతాయని తెలిపారు.వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని,వాతావరణ కాలుష్యనికి హానికరమైన ప్లాస్టిక్ ని వాడకుండా మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవాలని తెలిపారు. మాస్ మీడియా అధికారి ప్రకాష్ రాజు గారు కార్యాలయ సిబ్బంది,అధికారులతో స్వచ్చ ఆంధ్ర –స్వర్ణంద్ర ను పురస్కరించుకుకొని ప్రతిజ్ఞ చేయించినారు.ఈ కార్యక్రమములో జిల్లా వ్యాధినిరోధకటికాల అధికారిని డాక్టర్.ఉమా,డాక్టర్.కార్యాలయ పరిపాలన అధికారి అరుణ ,నాగప్రసాద్,సంచార చికిత్స కార్యక్రమ అధికారి డాక్టర్.రఘు,బాలస్వాస్త్య అధికారి డాక్టర్.మహేశ్వర ప్రసాద్, ఆరోగ్య విస్తరణ మరియు విద్యాధికారి బాబా ఫక్రుద్దీన్ ,డెప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పద్మావతి ,కార్యాలయ సిబ్బంది. మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

