త్యాగధనుల ఆశయ సాధనకు నేటి సమాజం కృషి చేయాలి
1 min read

సీనియర్ సిటిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్ కుమార్
విభిన్న ప్రతిభావంతుల బాలికల వసతి గృహంలో 79వ స్వాతంత్ర వేడుకలు
బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ డయాసిస్ ఆధ్వర్యంలో కార్యక్రమం
ఏలూరుజిల్లా ప్రతినిధి ఏలూరు న్యూస్ నేడు : దేశ స్వయం ప్రతిపత్తి తో పాటు భావితరాల ఉజ్వల భవిష్యత్తును కాపాడేందుకు ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన వారి ఆశయ సాధనకు బాసటగా నిలవాలని వెల్ఫేర్ అండ్ డిఫరెంట్ అండ్ సీనియర్ సిటిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్ కుమార్ పేర్కొన్నారు.79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక కోట దిబ్బ ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల బాలికల వసతిగృహం నందు ఘనంగా నిర్వహించారు. బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ డయోసిస్ ఆధ్వర్యంలో బాలికలకు కాస్మాటిక్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాంకుమార్, కార్యాలయ పర్యవేక్షకులు కె.కిషోర్ మాట్లాడుతూ కుల,మత, ప్రాంతీయ భావనలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ డయోసెస్ ఆప్ రాజమండ్రి సెక్రెటరీ రెవ ఫాదర్ ఆనంద్ కుమార్,ఏలూరు మిషన్ ప్రావిన్స్ రెవ ఫాథర్ యెహెజ్కెల్, అసోసిట్ రెవ ఫాథర్ జోసెఫ్, ఏలూరుడిస్ట్రిక్ట్ లీడర్ రెవ ఫాథర్ సత్య, ఢీకన్ ఫాదర్స్, కార్యాలయ సిబ్బంది, విభిన్న ప్రతిభావంతుల హాస్టల్ బాలికలు పాల్గొన్నారు.

