NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వం నేటికి ఐఆర్ ప్రకటించకపోవడం శోచనీయం

1 min read

ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామారావు

ఈ వేస్టేజ్ సేకరణ పేరుతో బోధనేతర పనులు అప్పగించటం హాస్యాస్పదం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ అమలుకావాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు ఐఆర్ కూడా ప్రభుత్వం ప్రకటించకపోవడం శోచ నీయమని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామారావు అన్నారు. ఏపీటీ ఎఫ్ ఏలూరు నగర శాఖ సమావేశం స్థానిక సంఘ కార్యాలయం వద్ద నగర అధ్యక్షుడు కురమ ఆనంద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. పీఆర్సీ అమలు చేయటానికి ప్రభుత్వంపై ఒత్తిడి లేకుండా కొన్ని సంఘాలు ప్రభుత్వానికి తొత్తులుగా మారాయని, దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని రామారావు ఆరోపించారు. ముఖ్యమంత్రి తమ పర్యటనలో ప్రకటించిన విధం గా వెంటనే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, పీఆర్సీ కమిటీ నివేదిక సమయాన్ని ఆరు నెలలకు కుదించి రిపోర్టు రప్పించుకుని అమలు చేయాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు తొమ్మండ్రు ప్రకాష్ మాట్లాడుతూ విద్యాశాఖ ఉన్నతాధికారులు వింత పోకడలు అవలంబిస్తూ ఉపాధ్యాయులను ఈ వేస్టేజ్ సేకరణ పేరుతో బోధనేతర పనులు అప్పగించటం హాస్యా స్పదమన్నారు. ఇటువంటి నిర్ణయాలు బోధనపై తీవ్ర ప్రభావం చూపి విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. నగర ప్రధాన కార్యదర్శి అబ్బదాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయులు పీఎఫ్ ఖాతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పీఎఫ్ ఖాతాలను ప్రారంభించాల న్నారు. సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *