రంగాపురం ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం!
1 min read
వైకాపా అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ
టీడీపీ అభ్యర్థి బొంతు కృపాజ్యోతి ఎన్నిక
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని రంగాపురం ఎంపీటీసీ స్థానాన్ని ఎన్డీఏ కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి బొంతు కృపాజ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. రంగాపురం ఎంపీటీసీ స్థానంలో పోటీకి నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బొంతు కృపాజ్యోతి ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో లింగపాలెం మండలంలో టీడీపీ ఖాతాలో తొలి ఎంపీటీసీ స్థానం చేరినట్లయింది..


