యువతను బానిస చేసే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుదాం
1 min read

పత్తికొండ , న్యూస్ నేడు: యువతను యువశక్తిని బానిసలుగా, వ్యసనపరులుగా మార్చే మాదక ద్రవ్యాలకు వ్యతిరేక పోరాటాలలో యువత ముందుండాలని భారత ప్రజాతంత్ర యువజన సంఘం ( డివైఎఫ్ఐ) పోరాటాలకు అండగా నిలవాలని డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు మహేంద్ర, ఉపాధ్యక్షులు కే.బీ నాగేంద్ర,వీరేంద్ర నాయుడులు పిలుపునిచ్చారు.మంగళవారం నాడు దేవనకొండ మండల కేంద్రంలో డివైఎఫ్ఐ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం సంఘం మండల ఉపాధ్యక్షులు జి ఎన్ ఆర్ నాగేంద్ర అధ్యక్షతన జరిగింది .ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దురాశతో కొంతమంది స్వలాభం కోసం చేస్తున్న డ్రగ్స్, గంజాయి వ్యాపారాల వలన యువత బానిసలుగా మారి సమాజానికి, కుటుంబానికి భారంగా మారుతున్నారని అన్నారు. డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు అధికారులు కలిసి రావాలని, అదేవిధంగా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కఠినంగా అధికారులు వ్యవహరించాలని వారు సూచించారు. త్వరలో మండల వ్యాప్తంగా భారత ప్రజాతంత్ర యువజన సంఘం (డివైఎఫ్ఐ )ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. అదేవిధంగా మండలంలోని మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని వారు ఆరోపించారు.గ్రామీణ ప్రాంతాల అంతర్గత రోడ్లు అద్వాన స్థితిలో ఉన్నాయని, గ్రామాల్లో సి.సి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ లేక సరైన విద్యుత్ సదుపాయం అందక ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల స్థితిపై త్వరలో డివైఎఫ్ఐ అన్ని గ్రామాల్లో సర్వే చేసి మండల వ్యాప్తంగా దశల వారి ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రవితేజ, రంగస్వామి, రాముడు, లోకయ్య తదితరులు పాల్గొన్నారు.

