ఘనంగా జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని సరస్వతీ శిశు మందిరం పాఠశాల ప్యాపిలి జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు మరియు బాలల దినోత్సవ వేడుకలు. శ్రీ సరస్వతీ శిశు మందిరం పాఠశాలలో కె. పార్వతి జవహర్ లాల్ నెహ్రు చిత్రపటానికి మాల వేసి పూజ నిర్వహించారు.సీనియర్ ఆచార్యులు వాసు తన ప్రసంగంలో నెహ్రు గురించి ప్రసంగించిరి. ఈయన మోతిలాల్ నెహ్రు స్వరూప రాణిలా ముద్దుబిడ్డ.ఈయన1889సంవత్సరం ఉన్నత కుటుంబంలో జన్మించాడని. ఈయన బారిస్టర్ చదువు చదివాడని,ఈయన “డిస్కవరీ ఆఫ్ ఇండియా” అనే పుస్తకాన్ని రచించాడని, ఈయన స్వతంత్ర సమరయోధుడని, భారత దేశపు మొట్ట మొదటి ప్రధానిమంత్రిగా పనిచేసారని, ఈయన అలినోద్యమ నాయకుడని అనేక ప్రాజెక్ట్స్ కట్టించారాని, పంచ వర్ష ప్రణాళికలా ద్వారా ప్రజలకు మేలు చేసారని, ఈయన పేరిట అనేక విద్యాలయాలు, ప్రాజెక్ట్స్, విమానాశ్రయాలు కట్టారని, భారత ప్రభుత్వం జవహర్ యోజన క్రింద పంచాయతీలకు ఫండ్స్ ఇచ్చారని గ్రామ స్వరాజ్య పాలనా సాగించాడని తెలియజేసారు. చిన్నారులందరు నెహ్రూ గురించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ప్రసంగించిరి. ఇద్దరు చిన్నారులు నెహ్రు వేశాధారణ వేశారు.చిన్నపిల్లలకు ఆటలు నిర్వహించి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమం లో ఆచార్యులు,పిల్లలు పాల్గొన్నారు.


