NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యం – ఎమ్మెల్యే  కోట్ల

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ ఎమ్మెల్యే  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో భాగంగా ప్యాపిలి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా, ప్రజలు నీటి సరఫరా, రోడ్లు, పింఛన్లు, విద్యుత్, ఆరోగ్య సదుపాయాలు వంటి ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే కి వివరించారు.ఎమ్మెల్యే  ప్రతి వినతిని శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత శాఖాధికారులతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలు ఎప్పుడైనా తమ సమస్యలను తెలియజేయవచ్చని సూచిస్తూ, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About Author