NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అబూబక్కర్ అంతిమయాత్రలో సిద్ధార్థ రెడ్డి, హఫీజ్ ఖాన్,సుధీర్..

1 min read

నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గఫూర్,నేతలు

నందికొట్కూరు , న్యూస్​ నేడు: వైఎస్ఆర్సీపీ మైనారిటీ రీజినల్ కోఆర్డినేటర్ మరియు ఆవాజ్ కమిటీ నంద్యాల జిల్లా అధ్యక్షులు అబూబక్కర్ మంగళవారం సా 6:30 కు కరెంట్ షాక్ కు గురై మరణించిన సంగతి తెలిసింది.విషయం తెలుసుకున్న రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, నందికొట్కూరు ఇన్చార్జి డాక్టర్ దారా సుద్దీర్,కర్నూలు మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్,సీపీఎం నేత ఎంఏ గఫూర్ అబూబక్కర్ మృతదేహానికి బుధవారం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.తర్వాత అబూ బక్కర్ పాడెను మోశారు. అంత్యక్రియల అనంతరం సిద్ధార్థ రెడ్డి,డాక్టర్ సుధీర్, హఫీస్ ఖాన్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామని సిద్ధార్థ రెడ్డి అన్నారు.వై చంద్రమౌళీ,సీపీ ఎం నాగేశ్వరరావు,సీపీఐ వెంకటేశ్వర్లు,పుల్యాల నాగిరెడ్డి,జెడ్పిటిసి జగదీశ్వర్ రెడ్డి,ఆర్టీసీ బాబు,మైనార్టీ నేతలు తదితరులు హాజరై నివాళులు అర్పించారు.

About Author