NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు,  మాట్లాడుతూ..కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సూపరింటెండెంట్  ఆధ్వర్యంలో జాతీయ నేత్ర దాన పక్షోత్సవాల కరపత్రిక విడుదల చేయడం జరిగింది అని అన్నారు. ఈ పక్షోత్సవాల ముఖ్య ఉద్దేశం ప్రజల్లో  నేత్రదానంపై అవగాహన కల్పించడం, పాఠశాలలు మరియు కళాశాలలో విద్యార్థుల అవగాహన కోసం నేత్రదానం చేయండి మరో ఇద్దరికి చూపు లేని వారికి చూపు ప్రసాదించండి అని అన్నారు.ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాల నిర్వహణ నేపథ్యంలో  వాల్   పోస్టర్ ను రిలీజ్ చేశారు అనంతరం నేత్రదానం చేయండి మరో ఇద్దరికి చూపు లేని వారికి చూపు ప్రసాదించండి అని  పిలుపునిచ్చారు. నేత్రదానాన్ని పవిత్రమైన బాధ్యతగా పాటిద్దాం అన్నారు,  మరణించిన వ్యక్తి సమాచారాన్ని ఆరు గంటల లోపల సమీపంలోని కంటి సేకరణ కేంద్రానికి ఇస్తే వైద్య సిబ్బంది వచ్చి నేత్రాలను సేకరిస్తారని తెలిపారు.ప్రజల మూఢనమ్మకాలు వదిలి నేత్రదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  నేత్రదానం అన్ని దానాల్లోకి గొప్పదని,  చనిపోతూ కూడా నేత్రదానం చేసి చిరంజీవులు కావాలని కోరారు.ఈ కార్యక్రమానికి ఇన్చార్జి సి ఎస్ ఆర్ ఎం ఓ, డా.వెంకటరమణ, అసోసియేట్ ప్రొఫెసర్, డా.శివబాల, మరియు ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్స్, సంపత్, ఆర్షద్ భాష మరియు కార్నియా రికవరీ టెక్నీషియన్స్, గంగాధర్, జి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author