NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆల్ ఇండియా స్థాయి మెడికల్ సదస్సులో మెరిసిన  కర్నూల్ ఎంబిబిఎస్ విద్యార్థి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఆల్ ఇండియా స్థాయి మెడికల్ సదస్సులో మెరిసిన  కర్నూల్ ఎంబిబిఎస్ విద్యార్థి… గైనిక్ విభాగాన్ని, కార్తీక్ ను అభినందించిన అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ..ఆల్ ఇండియా స్థాయి మెడికల్ సదస్సు ( GENESIS -2026) తమిళనాడు రాష్ట్రంలోని మద్రాస్ మెడికల్ కాలేజీలో ఈ నెల ఫిబ్రవరి 13,14 తేదీలలో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో  కర్నూల్ మెడికల్ కాలేజీ  ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్  విద్యార్థి  ఏ కార్తీక్  “కేస్ ప్రజెంటేషన్” యందు  జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించడం జరిగింది. పది సంవత్సరాల తర్వాత ఆల్ ఇండియా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు మొదటిసారిగా అందులో కర్నూల్ మెడికల్ కాలేజ్  వైద్య విద్యార్థి కార్తీక్ మొదటి స్థానం సాధించడం పట్ల అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ గైనకాలజీ విభాగపు వైద్యులను కార్తీక్ ను అభినందించడం జరిగింది. ఈ జాతీయ స్థాయి సదస్సుకు దేశవ్యాప్తంగా 225 మెడికల్ కాలేజీ ల నుంచే కాక ప్రతిష్టాత్మక ఎయిమ్స్,జిప్మర్ లాంటి  ఉత్తమ మెడికల్ కాలేజ్ నుంచి కూడావైద్య విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ సదస్సులో కార్తీక్ గైనిక్ విభాగం నుంచి అత్యంత క్లిష్టమైన “హెటిరోటోపిక్ ప్రెగ్నెన్సీ యూనికార్నియేట్ యుటిరస్ విత్ నాన్ కమ్యూనికేటింగ్ రుడిమెంటరీ హార్న్” కేసు గురించి ప్రజెంటేషన్ చేయడం జరిగింది.  ఈ కేస్ ప్రజెంటేషన్ కు గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ సావిత్రి, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ సుధారాణి, డా. కుముద  లు మార్గదర్శకత్వం వహించడం .

About Author