NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు ఎంపీ నివాసంలో నారా లోకేష్ ఆతిథ్యం

1 min read

సహచర మంత్రులతో ఐటీ మంత్రి  మాటామంతి

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడ: ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం రాత్రి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాసానికి వచ్చారు. లోకేష్ ను  తన నివాసానికి సాదరంగా ఆహ్వానించి. ఆయనతో పాటు వచ్చిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఇతర టీడీపీ ఎంపీలకు పుట్టా మహేష్ కుమార్ తన నివాసంలో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఎంపీలందరితో కలిసి కాసేపు సరదాగా గడిపిన లోకేష్ డిన్నర్ ముగిసిన అనంతరం ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు,ప్రాజెక్టులు, సమస్యలపై ఎంపీలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత వివిధ సమస్యలపై ఆర్ధిక, వాణిజ్య, రైల్వే మంత్రులను కలిసిన విషయాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్  నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చినట్లు ఎంపీ కార్యాలయ వర్గాలు తెలియచేశాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్ మరియు సహచర ఎంపీలు పాల్గొన్నారు.

About Author