ఊరి బడిని రక్షించుకుందాం… యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ లతీఫ్
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాలని,ప్రభుత్వ పాఠశాలల వైపు ప్రజల దృష్టిని మరల్చాలనే ఒక ధృఢ సంకల్పంతో సామాజిక స్పృహ కలిగిన ప్రతి యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు ఫిబ్రవరి నుండి వచ్చే విద్యాసంవత్సరం ఆగస్టు వరకు తల్లిదండ్రులను ప్రత్యేకంగా కలిసి ప్రైవేటు పాఠశాలల నుండి ప్రభుత్వ బడి వైపుకు రాబట్టుకోవాలనే లక్ష్యం మేరకు ప్యాపలి మండలం చంద్రపల్లి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ లతీఫ్ పాఠశాల అనంతరం అనగా సాయంత్రం 4:30 నిమిషాల నుండి 6:30 నిమిషాల వరకు చంద్రపల్లి గ్రామంలోని ప్రైవేటు పాఠశాలకు పంపించే పిల్లల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు.పాఠశాలనుండి గ్రామంలోని అన్ని వీధులు ర్యాలీ గా తిరుగుతూ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది.ప్రస్తుతం చంద్రపల్లి పాఠశాలలో తరగతి ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడని,8 విశాలమైన తరగతి గదులు ఉన్నాయని, పుస్తకాలు,2 జతల యూనిఫాం,బూట్లు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ప్రతిరోజూ రుచికరమైన మధ్యాహ్న భోజనం కలదని, అన్నిటికంటే గొప్పగా మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని,కావున పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఆయన అన్నారు.. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామాల్లోని ప్రతి పౌరునికి ఉందని. ఊరి బడిని ఇప్పుడు కాపాడుకోకపోతే భవిష్యత్ లో కనుమరుగయ్యే అవకాశం ఉందని గ్రామస్తులను ఆయన కోరారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంజనయ్య,శివకేశవులు,విజయలక్ష్మి,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

