NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోళగుందలో విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం

1 min read

హోళగుందన్యూస్ నేడు : కర్నూలు జిల్లా హోళగుందమండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ హోళగుంద పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రేరణాత్మక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయులు శ్రీ గాదిలింగప్ప  (కురుగోడు) ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని లక్ష్యాన్ని సాధించడానికి పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. చదువు ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలను సాధించవచ్చని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.ఈ కార్యక్రమంలో గత సంవత్సరం ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మొమెంటోలు మరియు పుస్తకాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు  కె. కబీర్ , సీనియర్ ఉపాధ్యాయులు శాంతవీరమూర్తి , ఉపాధ్యాయులు  దొడ్డబసప్ప   మంజుల , చాముండి  పాల్గొన్నారు.అలాగే అతిథులుగా శ్రీ చన్నబసవ  (లెక్చరర్), శ్రీ జె. రమేష్ , పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయులు హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

About Author