టీడీపీ పార్టీ కార్యాలయంలో మండల ప్రధాన కార్యదర్శుల సమావేశం
1 min read

హోళగుంద న్యూస్ నేడు : మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో మండల ప్రధాన కార్యదర్శుల సమావేశం మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ మండల ప్రధాన కార్యదర్శుల సమావేశానికి హొళగుంద మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు వెళ్లడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విచ్చేసి పార్టీ కేడర్ బలోపేతం, కార్యకర్తల పాత్ర మరియు బాధ్యతలపై వ దిశా నిర్దేశం చెస్తు .టీడీపీ క్యాడర్ కేర్ ట్రైనింగ్ మాడ్యూల్ గురించి వివరిస్తూ, తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు కేవలం అసెంబ్లీల్లో గెలుపు కోసం మాత్రమే కాదని, కార్యకర్తల నమ్మకం, నిబద్ధత, వారు ప్రతిరోజూ చేసే సేవల మీదే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని తెలిపారు.ఇతర పార్టీల్లో కార్యకర్తలను ఎన్నికల సమయంలో ఉపయోగించుకుని తర్వాత గాలికి వదిలేస్తారని, కానీ టీడీపీ దృష్టిలో కార్యకర్తలే అధినేత అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ మహత్తర ప్రయాణాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తుండగా,మంత్రి శ్రీ నారా లోకేష్ తీసుకుంటున్న చొరవతో పార్టీకి మరింత బలం చేకూరుతోందని పేర్కొన్నారు.కార్యకర్తలే పార్టీకి అసలైన శక్తి అని, టీడీపీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు తోడుగా ఉంటుందని తెలిపారు.


