NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రకృతి వ్యవసాయ విధానంలో డ్రోన్ ద్వారా సామూహిక పిచికారీ

1 min read

ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్

 డిపిఎం బి.వెంకటేష్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు మండలం పోణంగి గ్రామంలో బుధవారం ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజరు డిపియం బి.వెంకటేష్  సూచనలు మేరకు  రైతు మరిపూడి హరిబాబు తన 13 ఎకరాల పెసర పంటలో ప్రకృతి వ్యవసాయ విధానాలను అమలు చేశారు. రసాయన వ్యవసాయంలో పురుగుమందులు వినియోగం వల్ల అధిక ఖర్చులు మరియు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు పేర్కొన్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించడం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గించు కోవచ్చని, అనారోగ్య సమస్యలు నివారించవచ్చని తెలిపారు. ఈ క్రమంలో తన పొలంలో సామూహికంగా డ్రోన్ సహాయంతో 13 ఎకరాల్లో పిచికారీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.ఈ పిచికారీలో వేపగింజలు కషాయం, చేపబెల్లం ద్రావణం, మరియు జీవ అమృతంను కలిపి వినియోగించా మని తెలిపారు. ఈ విధానం ద్వారా పంటలకు సహజరక్షణ లభించడంతో పాటు నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని, పంట ఉత్పాదకత కూడా పెరుగుతుందని వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానాలు రైతులకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా లాభదాయకమని పేర్కొంటూ ఇతర రైతు సోదరులు అందరూ కూడా ఈ విధానాలను అనుసరించాలని వారు సూచించారు.

About Author