గాలివీడులో సుగవాసి – మండిపల్లి టిడిపి మండల, గ్రామ నాయకులు, కార్యకర్తల సమావేశం
1 min read
ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలి
కూటమి గెలుపే లక్ష్యం… గాలివీడులో పసుపు జెండా రెపరెపలే ధ్యేయం
కూటమి నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన సుగవాసి
అన్నమయ్య జిల్లా అక్టోబర్ 28 ( సి వెంకట్రామరాజు న్యూస్ నేడు బ్యూరో) : అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లోని గాలివీడు మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రచారానికి సర్వం సిద్ధమైంది. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులతో నిర్వహించిన కీలక సమావేశంలో రాయచోటి నియోజకవర్గం టిడిపి నాయకులు మండిపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డి ,రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, గాలివీడు జడ్పీటీసీ అభ్యర్థి సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు . గాలివీడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం గాలివీడు మండలంలోని ప్రతి గ్రామంలోనూ ప్రజల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఇరువురు నాయకులు పిలుపునిచ్చారు. వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ, కూటమి అభ్యర్థి సుగవాసి ప్రసాద్ బాబు ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.నాయకుల ఐక్యత… కార్యకర్తల కష్టం… ప్రజల మద్దతు… గాలివీడులో విజయానికి బాటలు!మన అభ్యర్థి గెలుపే మన లక్ష్యం!గాలివీడు జడ్పీటీసీగా సుగవాసి ప్రసాద్ బాబు విజయం కోసం కూటమి సైనికులు ఒక్కటై ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు.


