NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటింటి ప్రచారంలో కమతం రాజశేఖర్ రెడ్డి

1 min read

-సంక్షేమ పథకాలే టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తాయి..

మిడుతూరు న్యూస్ నేడు:  గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని మిడుతూరు మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జి కమతం రాజశేఖర్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో బుధవారం సాయంత్రం రెండో రోజు ‘ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ చెప్పాం చేస్తున్నాం’ కార్యక్రమంలో భాగంగా ఎంపీటీసీ,జడ్పిటిసి అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటికి వెళ్లి జడ్పిటిసి అభ్యర్థి సంపంగి హైమావతి మరియు మాసపేట ఎంపీటీసీ అభ్యర్థి హుస్సేన్ భాషను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా రెండు ఓట్లను సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, సోఫీ సాహెబ్,నబి రసూల్, సమ్మద్,అతావర్,జయరామి రెడ్డి,వీరారెడ్డి, రఘునాథరెడ్డి,దర్గయ్య, రామకృష్ణ,వెంకటరెడ్డి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *