NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

3 కోట్ల వ్యయంతో తాగునీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే           

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  ఎంతోకాలంగా తాగు నీటి కోసం పత్తికొండ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చడం కోసం మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన తాగునీటి పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ గురువారం ప్రారంభించారు. జల జీవన్ మిషన్ కింద మంజూరైన మూడు కోట్లతో కొత్తపల్లి రిజర్వాయర్ నుండి పత్తికొండ పట్టణానికి త్రాగునీరు అందించేందుకు నిర్మించిన తాగునీటి పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గతంలో పత్తికొండ పట్టణం త్రాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులను చూసి…. నేడు పత్తికొండ ప్రజల తాగునీటి ఇబ్బంది కలగకుండా రోజు మార్చి రోజు ప్రతి ఇంటికి త్రాగునీరు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కొత్తపల్లి రిజర్వాయర్ నుండి 3 కోట్లతో జలజీవన్ మిషన్ కింద పత్తికొండ పట్టణానికి త్రాగునీరు పథకాన్ని ప్రారంభించడం శుభ పరిణామమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. పత్తికొండ మండలం కొత్తపల్లి రిజర్వాయర్ దగ్గర నుండి పైప్లైన్ ద్వారా పత్తికొండ పట్టణానికి తాగునీటి నివారణ కోసం 3 కోట్ల రూపాయలతో  తాగునీటి పథకాన్ని బటన్ నొక్కి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రారంభించారు. గతంలో 2009 లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొత్తపల్లి దగ్గర  ఫిల్టర్ బెడ్లు ను  ఏర్పాటు చేసిందని,కానీ  గత ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగనీయకుండా అలాగే వదిలేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జలజీవన్ మిషన్ కింద నిధులను సమకూర్చుకొని తాగునీటి పథకాన్ని పటిష్టంగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. అలాగే ఎన్నో ఏళ్ల నుండి ఆయకట్టుని వదిలేసిన రైతులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేడు ఆయకట్టలను సాగు సాగు చేసుకుంటున్నారని అన్నారు.

About Author