సిద్ధార్థ రెడ్డిని సత్కరించిన మోమిన్ మన్సూర్..
1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అనుచరుడు మిడుతూరు మండలం ఉప్పలదడియ మైనార్టీ నాయకులు మోమిన్ మన్సూర్ కు పదవి వచ్చిన సందర్భంగా రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని మన్సూర్ శాలువాతో ఘనంగా సత్కరించారు.మంగళవారం సా 4:30 కు కర్నూలులో సిద్ధార్థ రెడ్డి స్వగృహంలో సిద్ధార్థ రెడ్డిని శాలువా,పూల బోకేతో సన్మానిస్తూ స్వీట్లను పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.పదవి వచ్చిన సందర్భంగా సిద్ధార్థ రెడ్డికి మన్సూర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలోవైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ నాయుడు,కొత్తపల్లి వైస్ ఎంపీపీ సింగారం రంగా,జిల్లా సెక్రటరీ కాటం రమణ,విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సురేష్ యాదవ్,సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


