NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టణంలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

1 min read

న్యూస్ నేడు నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గురువారం ఉదయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16 సంవత్సరముల పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాలను వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోకిల రమణారెడ్డి,పట్టణ అధ్యక్షులు మన్సూర్,రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి అబ్దుల్ జబ్బార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నందికొట్కూరు ఇన్చార్జి డాక్టర్ సుదీర్ స్వగృహం ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించారు.తర్వాత కేకును కట్ చేసి ఒకరినొకరు సంతోషంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ హయాంలోనే ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి బాటలోనే తనయుడు జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించారని వారు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే జగన్ తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు సురేష్ యాదవ్,లడ్డు,చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.

About Author