NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈనెల 26 నుండి వన్ టౌన్ గొలుసులు పంజా ఉరుసు మహోత్సవ కార్యక్రమాలు

1 min read

నేడు లాంఛనంగా ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: హజరత్ మౌలా అలీ ముష్కిల్ కుషా మహాత్ముల (గొలుసులపంజ)వారి ఉరుసు మహోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి పాల్గొన్నరు.ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన దశాబ్దాల కాలంనాటి ఈ గొలుసులు పంజా లో. సాంప్రదాయ పండుగ కార్యక్రమాలు ముస్లిం మత పెద్దలు సోదరులు  నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏలూరు నగర ప్రజలే కాక వివిధ ప్రాంతాల నుండి వేల సంఖ్యలో మతాలకతీతంగా  దర్గాని దర్శించుకుని ఆ బాబా ఆశీస్సులు అందుకుంటారన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ వర్క్స్ బోర్డ్ చైర్మన్ రాజా అహ్మద్, డాక్టర్: షేక్ బాజీ (గాజులు బాజీ)  డివిజన్ కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు, డివిజన్ మాజీ కార్పొరేటర్ కరణం గణేష్ ,డివిజన్ ఇంచార్జ్ తవ్వా అరుణకుమారి మరియు వివిధ హోదాలలో ఉన్న ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author