NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పిల్లల భవిష్యత్తు భద్రతకు పీఎం కేర్స్‌ ఫర్ చిల్డ్రన్ పథకం

1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు:   పిల్లల భవిష్యత్తు భద్రతకు, ఆర్థిక స్థిరత్వం కోసం  పీఎం కేర్స్‌ ఫర్ చిల్డ్రన్ పథకం అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో పీఎం కేర్స్‌ ఫర్ చిల్డ్రన్ అనే పథకం కింద 18 సంవత్సరాలు వయస్సు పూర్తి చేసుకున్న 7 మంది పిల్లలకు పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ అకౌంట్ పాస్ పుస్తకాలను కలెక్టర్ అందచేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం కేర్స్‌ ఫర్ చిల్డ్రన్ పథకం కింద పిల్లలు స్వతంత్రంగా జీవించడానికి, ఆత్మవిశ్వాసం అండ్​  ప్రేరణ కోసం సాయం అందుతుందని కలెక్టర్ తెలిపారు.. కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు చనిపోయి ఆ ఇంటి పిల్లలు చదువులకు దూరం అవుతున్న నేపథ్యంలో, వారికి ఆర్థిక సాయం అందించడానికి భారత ప్రభుత్వం ఈ పథకాన్ని లాంచ్‌ చేసిందన్నారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలో 7 మంది పిల్లలకు పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఖాతాలో కేంద్ర ప్రభుత్వం నుండి 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుండి 10 లక్షల ఎక్స్గ్రేషియా ను ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు ..అనంతరం అక్కడే ఉన్న పిల్లలతో కలెక్టర్ మాట్లాడుతూ బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని సూచించారు.కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి విజయ,  చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద లు తదితరులు పాల్గొన్నారు.

About Author