NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల ఫిర్యాదులను నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించండి

1 min read

జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

కర్నూలు,  న్యూస్​ నేడు: ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్  అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్  ప్రజల నుండి  సమస్యల వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ  ప్రజా ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి దరఖాస్తును పరిశీలించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి పరిశీలించి పరిష్కరించాలన్నారు. చేయలేదన్నారు.. అర్జీదారులకు అందజేసే ఎండార్స్‌మెంట్లు స్పష్టంగా, ఉండాలని పేర్కొన్నారు. రీ-ఓపెన్ అయిన అర్జీలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, అవి మళ్లీ పెండింగ్‌లో పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో డి ఆర్ ఓ సి. వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పిడి చిరంజీవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author