NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిబిఎస్​ఈ  సౌత్ తైక్వాండో ఛాంపియన్షిప్​లో రిడ్జ్ విద్యార్ధుల ప్రతిభ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు : స్థానిక లక్ష్మీపురం సమీపంలోని రిడ్జ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులు సిబిఎస్​ఈ  సౌత్తోజోన్-1 తైక్వాండో ఛాంపియన్షిప్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.ఆగష్టు 21 నుండి 24 వరకు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కమలా స్కూల్లో జరిగిన ఈ పోటీలలో 1 బంగారు పతకం, 3 రజత పతకాలు, 1 కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. పతకాలు పొందిన విద్యార్థులు వరుసగా యశ్వంత్రెడ్డి, కీర్తి, భరత్, శివ విఘ్నేష్ రెడ్డి, స్నికిత. పతకాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల సి.ఇ.ఓ గోపీనాథ్  అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కో.సి.ఇ.ఓ సౌమ్యగోపీనాథ్ , డీన్ రాజేంద్రన్ , ప్రిన్సిపల్ రాజ్కమల్ , ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ ఘనతకు కారకులైన తైక్వాండో మాస్టర్ సుందర్రాజ్ను పాఠశాల యాజమాన్యం వారు ప్రత్యేకంగా అభినందించారు.

About Author