NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎస్.వి. మోహన్ రెడ్డి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు నగరంలోని సంతోష్ నగర్‌లో పవిత్ర రంజాన్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి. మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ముస్లిం సోదరులకు ఆయన హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ మాసం ఆత్మపరిశీలన, నియమనిష్ఠ, సేవా భావం, త్యాగానికి ప్రతీక అని ఎస్.వి. మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సమాజంలో సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, మానవతా విలువలు మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నెలకొని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంతోష్ నగర్ ప్రాంతంలో రంజాన్ ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించబడ్డాయి.కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఎస్.వి. మోహన్ రెడ్డి అభివాదాలు తెలియజేసి, మత సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

About Author