NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రస్తుత ఖరీఫ్ లో4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యం

1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

రైతులకు అందించే ప్రోత్సాహకాలు,సేవలపై ముద్రించిన పోస్టర్లు విడుదల

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ప్రస్తుత ఖరీఫ్ లో జిల్లా యంత్రాంగం చేపట్టే  ధాన్యం సేకరణపై జిల్లాలోని రైతులందరికీ అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం ఖరీఫ్ లో ధాన్యం సేకరణపై జిల్లా యంత్రాంగం చేపట్టే చర్యలపై ముద్రించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ లో రైతుల నుండి 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాలు,  పిఏ సిఎస్ ల నుండి  సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.  రైతులకు  గోనెసంచులు పంపిణీ,ధాన్యం తేమశాతం లెక్కింపు, రైతులకు కూపన్ల జారీ,ధాన్యం రవాణా,రైతు అమ్మి ధాన్యానికి సొమ్ము రైతు ఖాతాకు జమచేయడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కలిగించేలా పోస్టర్లు ముద్రించడం జరిగిందన్నారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజకు మద్దతు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నదని,ఇందుకు సంబంధించి ప్రభుత్వం రైతులకు అందించే ప్రోత్సాహకాలు,సేవలపై ముద్రించిన పోస్టర్లను జిల్లాలోని అన్ని  రైతు సేవా కేంద్రాలు,పిఏ సిఎస్ ల వద్ద రైతులకు సమాచారం నిమిత్తం ప్రదర్శించాలని, రైతుల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కార మార్గాలను వారికి తెలియజేయాలన్నారు.కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్,డిఎస్ఓ విలియమ్స్,పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్  మూర్తి, జిల్లా సహకశాఖాధికారి ఆరిమిల్లి శ్రీనివాస్,ఎస్డీసీ దేవకీదేవి,డి.ఆర్.డి.ఏ.పీడీ డా:ఆర్.విజయరాజు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author