కనకదాసు విగ్రహం ధ్వంసం ని ఖండించిన ఎస్డీపిఐ
1 min read

సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఖండన
హొళగుంద న్యూస్ నేడు : సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI), ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్ కార్యదర్శి అబ్దుల్ రహమాన్ లు మాట్లాడుతూ , కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాలోని మనెకుర్తి గ్రామంలో గౌరవనీయ కనకదాసు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండించారు. కనకదాసు విగ్రహం చేయి విరగ్గొట్టడం ద్వారా ఈ దుండగులు సామాజిక సామరస్యాన్ని భంగపరిచేలా, ప్రజల మనోభావాలను గాయపరిచేలా వ్యవహరించారు. ఈ ఘటన స్థానిక ప్రజలలో ఆగ్రహాన్ని, ఆందోళనను రేకెత్తించింది.కనకదాసు సామాజిక సంస్కరణలకు, భక్తి ఉద్యమానికి చిహ్నంగా నిలిచిన మహనీయులు. ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా ఈ దుష్కృత్యం సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రగా మేము భావిస్తున్నాము.
మా డిమాండ్లు:*
1. ఈ ఘటనకు సంబంధించి వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపి, దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి.
2. ధ్వంసం చేయబడిన కనకదాసు విగ్రహాన్ని తక్షణమే పునరుద్ధరించి, దాని భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలి.
3. స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించే చర్యలు చేపట్టాలి.సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, సామాజిక శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ప్రజలందరూ శాంతియుతంగా ఉంటూ, ఈ ఘటనకు నిరసన తెలపాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కమిటీ సభ్యులు భాష, అస్లం, షఫీ, ఆఫీజ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

