NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మూడవ విడత అన్నదాత సుఖీభవ-పి ఎం కిసాన్  నిధుల విడుదల:ఎఓ రాజేష్

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: 2025-26 కి సంబంధించి మూడవ విడత అన్నదాత సుఖీభవ-పి ఎం కిసాన్ పథకానికి సంబంధించిన  నిధుల విడుదల అవుతున్నాయని ప్యాపిలి వ్యవసాయ అధికారి రాజేష్ ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు శుక్రవారం 13 న సాయంత్రం 4గంటల నుండి 6 గంటల వరకు ప్యాపిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2025-26 కి సంబంధించి మూడవ విడత అన్నదాత సుఖీభవ-పి ఎం కిసాన్ పథకానికి సంబంధించిన  నిధుల విడుదల కార్యక్రమంనకు డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ అన్నదాత సుఖీభవ-పి ఎం కిసాన్ పథకానికి సంబంధించిన  నిధుల ప్రారంభం చేస్తారని కనుక వ్యవసాయ అధికారులు మరియు రైతులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

About Author