NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యూరియా కొరకు స్లాట్ బుకింగ్

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  యూరియా కొరకు రైతులకు రైతు సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ ను అధికారులు ఏర్పాటు చేశారు. మహానంది మండలంలోని బొల్లవరం, తమ్మడపల్లె బుక్కాపురం, తిమ్మాపురం 4 గ్రామాలకు 95 టన్నుల యూరియా విడుదల అయినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి గురువారం పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రైతులకు టోకెన్ (స్లాట్) బుకింగ్ పద్ధతిలో అందజేసినట్లు తెలిపారు. శుక్రవారం రైతు సేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులకు యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. స్లాట్ బుకింగ్ ను వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి బుక్కాపురం గ్రామంలో పరిశీలించారు. స్పెషల్ బ్రాంచ్ కూడా యూరియా పంపిణి పై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది.

About Author