NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన వైశాలి

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సిఇసి మొదటి సంవత్సరం చదువుతున్న కోట వైశాలి నవంబర్ 8,9 వ తేదీలలో విశాఖపట్నం లో జరిగిన  రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలలో 400 మీటర్స్ ఫ్రీస్టైల్ విభాగం లో గోల్డ్ మెడల్ ను, 50 మీటర్స్ బ్రీస్ట్ స్ట్రోక్ విభాగం లో కాంస్య పథకం ను సాధించి ఢిల్లీ లో జరిగే జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైన వైశాలి ని ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం  మరియు అధ్యాపకులు అభినందిచారుఈ సందర్బంగా సుబ్రమణ్యం   వైశాలి కి కళాశాల తరుపున బహుమతి అందజేశారు, అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువు తో పాటు క్రీడాల్లో కూడ రానించాలి సొంత ఊరుకి, కళాశాల కు మంచి పేరు తీసుకొని రావాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న అధ్యాపకులు రామకృష్ణయ్య, నవీన పాటి, మద్దిలేటి, ఓబులేసు, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, ముస్తాక్, మురళి మోహన్, శంకరయ్య, సురేష్, వన్నూర్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

About Author