NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతిభా విద్యార్థులకు ఘన సన్మానం

1 min read

– జిల్లాలో మొదటి స్థానం సాధించిన సందేశ్‌కు అభినందనలు

జూనియర్ MPC విభాగంలో 464/470 మార్కులతో జిల్లా టాప్ – సెకండ్ ఇయర్ టాపర్ ముస్కాన్‌కు కూడా సన్మానం

హోళగుందన్యూస్ నేడు: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అత్యధిక మార్కులు సాధించి కళాశాల ప్రతిష్ఠను జిల్లాస్థాయిలో నిలబెట్టిన ప్రతిభా విద్యార్థులకు ఘనంగా సన్మాన సభ నిర్వహించడం జరిగింది. జిల్లాలోని మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు మన కళాశాల కూడా విశిష్ట స్థానం సాధించగా, Govt Junior Colleges కేటగిరీలో జూనియర్​ ఎంపీసీ  విభాగంలో జిల్లాలో మొదటి స్థానం దక్కించుకోవడం కళాశాలకు గర్వకారణమైంది.ఈ సందర్భంగా ఎన్‌.ఎస్‌. సందేశ్ అనే విద్యార్థి 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి జిల్లాలో జూనియర్​ ఎంపీసీ  విభాగంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల కేటగిరీలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని విద్యార్థిని మరియు ఆయన తల్లిదండ్రులను కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.అదేవిధంగా కళాశాలలో సెకండ్ ఇయర్ టాపర్‌గా నిలిచిన సి. ముస్కాన్, సీనియర్ బైపిసి  విభాగంలో 1000 మార్కులకు గాను 970 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది. ఆమెను కూడా తల్లిదండ్రులతో కలిసి సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన ఈ ఫలితాలు కళాశాల అధ్యాపక బృందం కృషికి నిదర్శనమని, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో టాపర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం మరియు ఇతర విద్యార్థులు పాల్గొని అభినందనలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *