టిఇటి నోటిఫికేషన్ రద్దు చేయాలి…
1 min read

యుటిఎఫ్ సీనియర్ నాయకులు.అబ్దుల్ లతీఫ్
ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపలి మండల శాఖ ఆధ్వర్యంలో ప్యాపలి బాలుర మరియు బాలికల కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లో నూతనంగా చేరిన డిఎస్సీ 2025 ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా యూటీఎఫ్ సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి విడుదల చేసిన టిఇటి నోటిఫికేషన్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ ఇప్పుడు టిఇటి రాసి ఉత్తీర్ణులు కావాలని చెప్పడం అత్యంత దారుణమని. ఏ ఉద్యోగ వర్గానికి లేని ఆంక్షలు ఒక్క ఉపాధ్యాయ వర్గానికే ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పాలని.సుప్రీం కోర్టు చెప్పిందని ఇలా ఉపాధ్యాయులను టిఇటి రాయమంటున్న ప్రభుత్వం మరి అదే సుప్రీం కోర్టు పెన్షన్ బిక్ష కాదు హక్కు అని కూడా తీర్పు ఇచ్చిందని.ముందు ఆ తీర్పును అమలు చేస్తే బాగుంటుందని..ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను రావాల్సిన డిఎ ల గురించి గానీ,పిఆర్సి గురించి గానీ పెండింగ్ లో ఉన్న 33 వేల కోట్ల గురించి గానీ కనీసం చర్చలు కూడా జరపడానికి సిద్ధంగా లేని ప్రభుత్వం కోర్టు తీర్పు ను ఆసరాగా చేసుకుని ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టాలని నోటిఫికేషన్ విడుదల చేసిందని..తక్షణమే టిఇటి నోటిఫికేషన్ రద్దు చేయాలని,పెండింగ్ డిఎ లు ప్రకటించాలని,పిఆర్సి కమిటీ నియమించాలని,ఈలోగా ఐఆర్ 30% ప్రకటించాలని..ముందుగా బోధనేతర పనులు పూర్తిగా రద్దు చేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ సీనియర్ నాయకులు నందీశ్వర రెడ్డి, షూకూర్,మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.


