బంకులు తొలగించిన కమిషనర్ కు ధన్యవాదాలు..!
1 min read

ఎమ్మెల్యే క్రీడా మైదానంలో బంకులు తొలగించరా..? కు స్పందన
పి.డి.ఎస్.యు
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ మైదానంలో అక్రమంగా ఏర్పాటు చేసిన బంకులను తొలగించి, అవినీతికి పాల్పడిన మునిసిపల్ అధికారుల చిట్టా బయట పెట్టిస్తాని సవాల్ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ఇప్పుడు ఎందుకు తొలగించలేకపోతున్నారని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం(పి.డి.ఎస్.యు) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మహేంద్ర బాబు గత కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం జరిగింది. ఎట్టకేలకు మునిసిపల్ కమిషనర్ గంగిరెడ్డి స్పందించి కోట్ల విలువ చేసే స్థలంలో ఏర్పాటు చేసిన బంకులను తొలగించడం పై పట్టణ ప్రజలు, పి.డి.ఎస్.యు విద్యార్థి సంఘం తరపున హర్షం వ్యక్తం చేస్తూ మునిసిపల్ కమిషనర్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

