ఎయిర్ పొల్యూషన్ లేని నగరంగా ఏలూరుని తీర్చిదిద్దుతాం…
1 min read

నగర పాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు
కృష్ణ కాలువకు వెంబడి మొక్కలు నాటే కార్యక్రమం
సుమారు 600 మొక్కలు అవసరమని గుర్తింపు
పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ ఏ.భాను ప్రతాప్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఎయిర్ పొల్యూషన్ లేని ఏలూరు నగరముగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు చూసుకుంటున్నామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. నేషనల్ క్లీన్ ఎయిర్ పొల్యూషన్ పిలుపులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో నగరంలో అన్ని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిరంతర ప్రక్రియగా జరుగుతుందన్నారు.ఈరోజు స్థానిక పాత బస్టాండ్ నుండి తూర్పు లాకుల వరకు గూడ్స్ షెడ్ రోడ్డు కృష్ణ కాల్వ వెంబడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేయర్ నూర్జహాన్ పెదబాబు ప్రారంభించారు.కృష్ణ కాల్వ వెంబడి ఇరువైపులా 6 వందలు మొక్కలు అవసరం అవుతాయని గుర్తించా మన్నారు.రోజు రోజుకీ గాలిలో కాలుష్యం పెరుగుతుందన్నారు.పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించకపోయినట్లయితే వివిధ రకాల వ్యాధులు ప్రబలి ప్రజలు అనారోగ్యానికి గురవుతారన్నారు. అందుకే మొక్కలు నాటే కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామన్నారు.ఏలూరు నగరం స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మొక్కలు నాటడం,ప్లాస్టిక్ నివారించడం,రోడ్లమీద,కాలువల్లో చెత్త వేయకుండా చూడడం మొదలగు చర్యలు చేపట్టడం జరుగుతుందని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు.నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని ప్రజలను కోరుతున్నామన్నారు. డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు,మున్సిపల్ కమిషనర్ ఏ.భాను ప్రతాప్ మాట్లాడుతూ ఎయిర్ పొల్యూషన్ నివారించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలోపట్టణపార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం,క్లస్టర్ ఇంచార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు,డివిజన్ ఇంచార్జ్ దాకారపు రాజేశ్వరరావు,కార్పొరేటర్లు సబ్బన శ్రీను వాసరావు,దేవరకొండ శ్రీనివాసరావు,పాము శామ్యూల్,కో-ఆప్షన్ సభ్యులు నీత విజయ్ కుమార్ జైన్,ఎం.ఈ సురేంద్రబాబు,డి.ఈ అప్పలరాజు,ఏయి రఫీ, స్థానిక నాయకులు సిర్ల శ్రీనివాసరావు,జవ్వాజి రామగోపాల్,విన్నకోట విజయ కుమార్ జాగారపు వీర్రాజు అసీనా తదితరులు పాల్గొన్నారు.


