NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మరోసారి నియోజకవర్గ ప్రజల పట్ల తన ప్రేమాభిమానాలు చాటుకున్న ఎమ్మెల్యే

1 min read

నియోజకవర్గంలో 4200 మందికి పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా

 ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రంజాన్ పండగను పురస్కరించుకుని దెందులూరు నియోజకవర్గంలోని పేద ముస్లిం కుటుంబాలకు రేపు రంజాన్ తోఫా అందించనున్న దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్నియోజకవర్గంలోని దాదాపు 4200మంది పేద ముస్లింలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ తరఫున పాలు,సేమ్యా, పంచదారతో పాటు మటన్ కూడా అందించేందుకు భారీగా సన్నాహకాలురంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం దెందులూరు నియోజకవర్గం లోని దాదాపు 1500 పేద ముస్లిం కుటుంబాల నిమిత్తం 400 కేజీల సేమియా,400 కేజీల పంచదార ,1500 లీటర్ల పాలతో పాటు దాదాపు 1400 కేజీల మటన్ ను రంజాన్ కానుకగా పంపిణీ చేయడానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంసిద్ధమయ్యారు.గత నాలుగు రోజులుగా నియోజకవర్గంలోని మహిళ కుటీర పరిశ్రమల నిర్వాహకులకు చేయూతన అందిస్తూ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూర్తి నాణ్యత కల్గిన గోధుమపిండితో సేమ్యాను తయారు చేయించా రు.దెందులూరు నియోజకవర్గంలోని గ్రామాల వారీగా పేద ముస్లిం కుటుంబాల జాబితాను సిద్ధం చేసి తద్వారా రేపు ఆయా గ్రామాల్లో నివసిస్తున్న వేలాది మంది ముస్లిం కుటుంబాలకు, తమ కుటుంబ సభ్యునిగా, ఆ కుటుంబాల్లో ఒక పెద్ద కొడుకుగా, ముస్లిం సోదరులకు సోదరీమణులకు ఒక అన్నగా, ముస్లిం తల్లులకు బిడ్డగా, భావిస్తూ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా,నాయకుడిగా దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్  రేపు వారందరికీ రంజాన్ కానుకను అందించనున్నారు.ఈ విధంగా కులమత విభేదాలకు అతీతంగా నియోజకవర్గంలో ఏ పండగ వచ్చినా ఆయా కుటుంబాలకు మరింత ఆనందాన్ని అందిస్తూ ఒక పెద్ద కొడుకుగా అండగా నిలుస్తున్న దెందులూరు ఎమ్మెల్యే  నిజమైన నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం అని పలువురు కూటమి నాయకులు నియోజకవర్గ ప్రజలు కొనియాడుతున్నారు.

About Author