మెడికవర్ ‘ లో ఉగాది వేడుకలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలులో లో వైద్యులు, సిబ్బందితో కలిసి ఉత్సాహభరితంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయ పూజలు నిర్వహించి, పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఉగాది ప్రత్యేకతను తెలియజేస్తూ, ఆసుపత్రి సిబ్బంది అందరూ కలిసి ఉగాది పచ్చడి తయారు చేసి ఆనందాన్ని పంచుకున్నారు. జీవితంలోని ఆరు రుచులను సూచించే ఉగాది పచ్చడి ద్వారా సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ వేడుకల్లో భాగంగా సిబ్బందికి వివిధ వినోదాత్మక ఆటలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా సిబ్బంది మధ్య అనుబంధం మరింత బలపడటంతో పాటు, ఉత్సాహం మరియు భాగస్వామ్యం పెరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “ఉగాది కొత్త ఆరంభాలకు ప్రతీక. ఇలాంటి పండుగలను కలిసి జరుపుకోవడం ద్వారా సిబ్బంది మధ్య ఐక్యత, ఆనందం పెరుగుతుంది. మా ఆసుపత్రిలో కుటుంబ వాతావరణాన్ని సృష్టించడం మా లక్ష్యం. ఇలాంటి కార్యక్రమాలు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచి, సేవా భావాన్ని మరింత బలోపేతం చేస్తాయి” అని తెలిపారు.

