అత్యంత వైభవంగా ఇఫ్తార్ విందు
1 min read

హోళగుందన్యూస్ నేడు: హోళగుంద రాజనగర్ కాలనీ లో నూరానీ జామియా మసీదు లో ఘనంగా టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈబిజీ గోవింద్ గౌడ్ అలానే టిడిపి యువనాయకుడు ఈబిజీ రాజేంద్ర గౌడ్ అలానే యువనాయకుడు ఇబిజి భువనేష్ గౌడ్ ఇఫ్తార్ విందు ముఖ్య అతిథిగా విచ్చేసిన టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ యువనాయకులు రాజేంద్ర గౌడ్ భువనేష్ గౌడ్20 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న సేవా సంప్రదాయంటీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో హోళగుంద లో ఇఫ్తార్ విందు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులందరూ ఐక్యంగా జరుపుకునే ఈ ఇఫ్తార్ విందును గోవింద్ గౌడ్ గత 20 సంవత్సరాలుగా ఒక సంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్నారు. బుధవారం కార్యక్రమంలో భాగంగా రాజనగర్ కాలనీ నూరాని మసీదు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ యువ నాయకులు రాజేంద్ర గౌడ్ భువనేష్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం, గోవిందు గౌడ్ విందును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఈ బిజీ గోవిందు గౌడ్ మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలన్నదే ఈ విందు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ విందులో టిడిపి కె పీరన చినిగి హుస్సేన్ పీరా సులేమాన్ పీర్‌సాబ్, ఉసేని, మరియు స్థానిక ధుదేకల్ పెద్దలు, మత గురువులు, టిడిపి నాయకులు మరియు భారీ సంఖ్యలో సోదరులు పాల్గొన్నారు.

