NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“అనస్థీషియాలో ఆల్ట్రాసౌండ్ ఆధునిక  స్కిల్స్ పై అప్ డేషన్”

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: “కె.యం.సి అనస్థీషియా విభాగం ఆధ్వర్యంలో పోకస్ ప్లస్ 2025 ( POCUS PLUS-2025)  హాండ్స్ ఆన్ ట్రైనింగ్”… “వైద్యులు తమ నైపుణ్యాలను నిరంతరం ఆధునికరించుకోవాలి”… అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ.  వైద్యులు ఆధునిక ఆవిష్కరణలను అందిపుచ్చుకొని తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు  మెరుగుపరుచుకోవాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె చిట్టి నరసమ్మ అన్నారు. శనివారం కర్నూల్ మెడికల్ కాలేజీ యందలి మోర్టాన్ స్కిల్ ల్యాబ్ యందు అనస్థీషియాలజి, కర్నూల్ సొసైటీ ఆఫ్ అనస్థీషియాలజి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల హాండ్స్ అన్ ట్రైనింగ్ “పోకస్ ప్లస్ 2025 ( POCUS PLUS-2025) ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వైద్యుడు నిత్య విద్యార్థి అని వైద్యరంగంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణ ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం ద్వారా మరింత మెరుగుగా కచ్చితత్వంతో రోగులకు వైద్య సేవలు అందించవచ్చునని ఆమె అన్నారు. అడిషనల్ డి.యం.ఈ & సర్వజన వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ  వైద్య రంగలో అనస్థీషియా విభాగపు ప్రాధాన్యత వెలకట్టలేనిది అని  ప్రతి సర్జరీ  అనస్థీషియా వైద్యల సహకారం తోనే జరుగుతుంది అని అన్నారు. అల్ట్రా సౌండ్ సహకారంతో ఖచ్చితమైన ప్రదేశంలో రోగికి మొత్తు అందించడం ద్వారా సురక్షితమైన సర్జరీకి మార్గం ఏర్పడుతుంది అని అన్నారు. ఈ రెండు రోజుల హాండ్స్ ఆన్ శిక్షణలో  లంగ్ & ఎయిర్ వే యు.ఎస్.జి , ఫ్లూయిడ్ రెస్పాన్సివ్నెస్,అప్పర్ & లోయర్ లింబ్స్, ట్రన్కాల్ బ్లాక్స్, టి.టి.ఇ మొదలగు అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన అనస్థీషియా వైదులకి నిపుణులు శిక్షణ ఇచ్చి  వారిచే చేయిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనస్థీషి యా విభాగపు అధిపతి,ఛైర్మెన్ డా. విశాల, వైస్ చైర్మన్ డాక్టర్ రామ్ శివ నాయక్, సెక్రటరీ జయదేవ్ రాథోడ్, ఏపి.యం.సి అబ్జర్వర్ ఫార్మకాలజి విభాగాధిపతి డాక్టర్ రాజేష్, కర్నూల్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా ప్రెసిడెంట్ డా.సుదీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author