NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగేలా చేశాం: ఎమ్మెల్యే కోట్ల

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు:ప్యాపిలి మండలంలోని డి.రంగాపురం,రచవాండ్ల పల్లి, రామాపురం, జక్కసానిగుంట్ల గ్రామంలో బుధవారం రచ్చబండ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి , డీసీఎంఎస్ చైర్మన్  వై నాగేశ్వరరావు యాదవ్  పాల్గొన్నారు.అనంతరం మామిళ్ల పల్లె గ్రామంలో పిఎంఎవై క్రింద అమలైన నాలుగు నూతన గృహాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.గ్రామ ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలు, అభ్యర్థనలు, అభివృద్ధి సూచనలను స్వయంగా విన్నారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామంలో రోడ్లు, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, విద్యాసంస్థల మెరుగుదల వంటి అంశాలపై ప్రజలతో సమగ్రంగా చర్చించారు.గ్రామంలోని రైతులు, మహిళా సంఘాలు, యువత తో ప్రత్యేకంగా సమావేశమై, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజల అభ్యర్థనల మేరకు సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో డి రంగాపురం  నాయకులు ,కార్యకర్తలు, రచవాండ్లపల్లి నాయకులు కార్యకర్తలు, రాంపురం తేదేపా నాయకులు కార్యకర్తలు, మామిళ్ళపల్లి తేదేపా నాయకులు, కార్యకర్తలు, జక్కసానిగుంట్ల తేదే పై నాయకులు కార్యకర్తలు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author