NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పుల్యాల నాగిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం

1 min read

నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బైరెడ్డి మల్లికార్జున రెడ్డి

న్యూస్ నేడు నందికొట్కూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగిడ్యాల మండల అధ్యక్షుడు పుల్యాల నాగిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని బైరెడ్డి మల్లికార్జున రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా పగిడ్యాలలో పుల్యాల నాగిరెడ్డి కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు.నాగిరెడ్డి అక్రమ అరెస్టు దారుణమనిఅన్నారు.పగిడ్యాల జెడ్పీటీసీ పుల్యాల దివ్యను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అక్రమ అరెస్ట్ లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడొద్దని తెలియచేశారు.తర్వాత జూపాడుబంగ్లా మండలం తాటిపాడు వైసీపీ కార్యకర్త శీను భార్య మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి బైరెడ్డి మల్లికార్జున్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో లింగాపురం సర్పంచ్ నాగార్జున రెడ్డి,కోసిక తిరుమలేశ్వర్ రెడ్డి,రమేష్ రెడ్డి,జీఎం రెడ్డి,తరుణ్ కుమార్ రెడ్,రాఘవ రెడ్డి  పాల్గొన్నారు.

About Author