NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చట్టాలు,సైబర్ క్రైమ్ పై అవగాహన

1 min read

సిడిపివో మంగవల్లి..ఎస్ఐ నాగేంద్ర

నందికొట్కూరు న్యూస్ నేడు: మహిళలకు విద్యార్థులకు ఉన్న చట్టాలు మరియు సైబర్ క్రైమ్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిధిలోని పి ముచ్చుమర్రి జిల్లా పరిషత్ పాఠశాలలో అంగన్వాడి సూపర్ వైజర్ శేషమ్మ ఆధ్వర్యంలో పాఠశాలలో మంగళవారం ‘బేటి బచావో-బేటీ పడావో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముచ్చుమర్రి ఎస్సై నాగేంద్ర మరియు అంగన్వాడీ సిడిపివో బిఏ మంగవల్లి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అంగన్వాడి అధికారుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండే విధంగా మీరు లక్ష్యాలను ఎంచుకోవాలని అన్నారు. అదేవిధంగా బాలికలను ఎవరైనా వేదిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సిడిపివో మాట్లాడుతూ బాలికలకు ఏమైనా అత్యవసరమైనచో 112.. చైల్డ్ హెల్ప్ లైన్-1098 నంబర్ కు ఫోన్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం అధికారులు చూపుతారని అన్నారు.పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన విధంగా నడుచుకోవాలని ముఖ్యంగా బాలికలు ఎవరైనా మంచి మాటలతో నమ్మించాలని చూస్తే అలాంటి వారిని నమ్మవద్దని బాలికలకు సూచించారు. చదువుపై దృష్టి సారించి పరీక్షల ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ ఆశీర్వాదమ్మ,పోలీస్ సిబ్బంది సంజీవయ్య, కొండయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *