NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో ప్రతిపాదిత పారిశ్రామిక ప్రాజెక్టులను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలి

1 min read

పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు త్వరితగతిన కల్పించాలి

ఏడు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్లాట్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి

కర్నూలు, న్యూస్​ నేడు: జిల్లాలో ప్రతిపాదిత పారిశ్రామిక ప్రాజెక్టులను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లో పరిశ్రమల స్థాపన పురోగతి పై పరిశ్రమల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ఇప్పటికే అమలుకు సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులతో పాటు, వివిధ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలకు (ఎంఓయూలు) సంబంధించిన పరిశ్రమల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.. జిల్లాలో పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి విండ్ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టులు, ఓర్వకల్లు ప్రాంతంలో డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలు, ఫార్మా పరిశ్రమలు, డ్రోన్ సిటీలో డ్రోన్ల తయారీ యూనిట్ల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయని పరిశ్రమ శాఖ అధికారులు  కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా, ఆయా ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైన అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేయడంతో పాటు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్ పరిశ్రమ శాఖ అధికారులను ఆదేశించారు.  అదే విధంగా జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ఏడు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా పార్కుల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పారిశ్రామిక ప్లాట్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్లాట్లు కేటాయించడం ద్వారా నిరుద్యోగ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ సొంత పరిశ్రమలను స్థాపించేందుకు అవకాశం కల్పించాలని, తద్వారా జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు స్థానికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని  కలెక్టర్ పరిశ్రమ శాఖ అధికారులను ఆదేశించారు..సమావేశంలో  పరిశ్రమల శాఖ అధికారి సంజీవ రాజు, ఏపిఐఐసి జెడ్ ఎం మధుసూదన్ రెడ్డి, నెడ్ క్యాప్ అధికారి వీరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *